నిజం

అయినా నిష్ఠూరం కానిది

Friday, August 17, 2007

ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,

ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,
నాకు తెలియకుండా నా ప్యాంటు జేబులో చెయ్యెందుకు పెట్టావ్?

డబ్బుకోసమా?
కాదు...
క్రెడిట్‌కార్డ్ కోసమా?
కాదు.. కాదు....
నా పర్సు కోసమా?
కాదు.. కాదు... కాదు......
మరి దేనికోసం?
“సినిమా టిక్కెట్ల కోసం”





ఘాటుగా ఉంది కదు... అతిగా ఉంది కదూ...
బూతుందంటూనే స్వాతి చదువుతాం .....(రీడర్‌షిప్ సర్వే)
ఘాటుగా ఉందంటూ రేడియో మిర్చే వింటాం.... (లిజనర్ షిప్ సర్వే)
సగటు భారతీయులుగా మనం కోరుకునేదదేనేమో?

Wednesday, August 15, 2007

రాజీవ్ గాంధీ నగర్

రాజీవ్ గాంధీ నగర్
మా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పేరును మారుస్తున్నారని ఈరోజు కాలనీ బంద్ చేస్తున్నారు. బస్సులు కూడా కాలనీలో ఆపివేస్తున్నారని యమ్‌యమ్‌టిసిలో ఆఫీసుకు వచ్చాను. ఎంతయినా కార్యాలయంలో పనికన్నా హాజరు ముఖ్యం కదా!
అయినా నిరసనను బందులరూపంలో కాకుండా వేరే రూపంలో ప్రదర్శిస్తే బాగుండునని పిస్తుంది. ఎందుకిలా విలువైన మానవపని గంటలు వృధా చేస్తారు? దాని బదులు రోడ్లపక్కన మొక్కలు నాటో, రోడ్లు శుభ్రంచేసో నిరసన తెలపవచ్చు కదా?
జపాన్‌లో అనుకుంటా ఎక్కడో చదివా కార్మికులకు కోపంవస్తే విపరీతంగా ఉత్పాదకత పెంచేస్తారట... దాంతో వస్తువు విలువ మార్కెట్‌లో అమాంతం పడిపోతుందట... దాంతో యాజమాన్యానికి విపరీతమైన నష్టం... ప్రజలకు లాభం.... ఇదేదో బాగుంది.