నిజం

అయినా నిష్ఠూరం కానిది

Wednesday, August 15, 2007

రాజీవ్ గాంధీ నగర్

రాజీవ్ గాంధీ నగర్
మా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పేరును మారుస్తున్నారని ఈరోజు కాలనీ బంద్ చేస్తున్నారు. బస్సులు కూడా కాలనీలో ఆపివేస్తున్నారని యమ్‌యమ్‌టిసిలో ఆఫీసుకు వచ్చాను. ఎంతయినా కార్యాలయంలో పనికన్నా హాజరు ముఖ్యం కదా!
అయినా నిరసనను బందులరూపంలో కాకుండా వేరే రూపంలో ప్రదర్శిస్తే బాగుండునని పిస్తుంది. ఎందుకిలా విలువైన మానవపని గంటలు వృధా చేస్తారు? దాని బదులు రోడ్లపక్కన మొక్కలు నాటో, రోడ్లు శుభ్రంచేసో నిరసన తెలపవచ్చు కదా?
జపాన్‌లో అనుకుంటా ఎక్కడో చదివా కార్మికులకు కోపంవస్తే విపరీతంగా ఉత్పాదకత పెంచేస్తారట... దాంతో వస్తువు విలువ మార్కెట్‌లో అమాంతం పడిపోతుందట... దాంతో యాజమాన్యానికి విపరీతమైన నష్టం... ప్రజలకు లాభం.... ఇదేదో బాగుంది.

5 Comments:

At 5:10 PM, Blogger Naga said...

ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి ఇలా పేర్లు మార్పిడి చేసే హక్కును ఎవరిచ్చారు మరి?

 
At 9:52 PM, Blogger మదన్ మోహన్ said...

పేర్లుమార్చడం ఖచ్చితంగా తప్పేనండి... అయితే నిరసన ధనాత్మకంగా ఉండాలని నాభావన.

 
At 1:41 AM, Blogger రవి వైజాసత్య said...

రాజీవ్ గాంధీ నగర్ అని ఉన్నచోటల్లా పిడకలు వేస్తే ఎలా ఉంటుంది?? పిడకలకి పిడకలు..నిరసనకి నిరసనా !!!

 
At 6:20 AM, Blogger spandana said...

ఈ పిడకల అవిడియా చాలా బాగుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

 
At 6:13 AM, Anonymous Anonymous said...

ストーカー 高級クラブ 求人 二人だけの結婚式 大人のおもちゃ 表参道 エステ ビジネス 英会話 税理士 東京 電報 結婚式 まつげエクステ カップリングパーティー 浮気調査 興信所 興信所 高収入 アルバイト 高収入 アルバイト 競馬 電話占い カップリングパーティー ウェルカムボード 株式情報

 

Post a Comment

<< Home