వీటికి ఈ పేరెలా వచ్చింది?
వీటికి ఈ పేరెలా వచ్చిందంటే
తిరుపతికి ఆ పేరెలా వచ్చిందంటే తిరుపతిలో డబ్బుల్లేనిదే ఏ పనీ కాదు. తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ప్రతివాడు “తియ్ రూపాయ్ తియ్”, “తియ్ రూపాయ్ తియ్” అంటాడు. అందుకే దానికి తిరుపతి అనే పేరు స్ధిరపడిపోయిందన్నమాట.
తిరుమలకు ఆపేరెలావచ్చిందంటే తిరుపతి నుండి తిరుమల వెళ్ళే ప్రతివాడు బస్సులో రుమాల్ (ఖర్చీఫ్) వేసి సీటు రిజర్వ్ చేసుకునేవాడు. కండక్టర్ బస్సు ఎక్కినవెంటనే “తియ్ రుమాల్” , “తియ్ రుమాల్” అని అరిచేవాడు. అలా తిరుమలగా స్ధిరపడిపోయిందన్నమాట.
చపాతి కి ఆపేరెట్లావచ్చిందంటే ఒకావిడ ప్రయోగశాల్లో కష్టపడి ప్రయోగం చేసి తయారుచేసిన వంటకాన్ని తన భర్తకు రుచి చూడమని పెడితే ఆయనగారు తిని "ఛ...పో...తియ్" అన్నాట్ట. అది కాస్తా చపాతీగా స్ధిరపడి పోయింది.
దోశకు ఆపేరెలావచ్చిందంటే రెండు సార్లు (దో) ఉస్ అంటుంది కనుక.
హామీపత్రం: ఖచ్చితంగా పైవన్నీ నిజం కాదు, నా సొంతమూ కాదు.