నిజం

అయినా నిష్ఠూరం కానిది

Saturday, May 29, 2010

టీ షర్టులు

టీ షర్టుల మీద చారలు ఎక్కవగా అడ్డంగానే ఎందుకుంటాయి? పొట్టిగా ఉన్న వాళ్ళు అడ్డం చారలున్న చొక్కా తొడుక్కుంటే మరింత పొట్టిగా కనబడతారు... అయినా అడ్డమే అధికం ఎందుకనో?

Friday, August 17, 2007

ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,

ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,
నాకు తెలియకుండా నా ప్యాంటు జేబులో చెయ్యెందుకు పెట్టావ్?

డబ్బుకోసమా?
కాదు...
క్రెడిట్‌కార్డ్ కోసమా?
కాదు.. కాదు....
నా పర్సు కోసమా?
కాదు.. కాదు... కాదు......
మరి దేనికోసం?
“సినిమా టిక్కెట్ల కోసం”

ఘాటుగా ఉంది కదు... అతిగా ఉంది కదూ...
బూతుందంటూనే స్వాతి చదువుతాం .....(రీడర్‌షిప్ సర్వే)
ఘాటుగా ఉందంటూ రేడియో మిర్చే వింటాం.... (లిజనర్ షిప్ సర్వే)
సగటు భారతీయులుగా మనం కోరుకునేదదేనేమో?

Wednesday, August 15, 2007

రాజీవ్ గాంధీ నగర్

రాజీవ్ గాంధీ నగర్
మా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పేరును మారుస్తున్నారని ఈరోజు కాలనీ బంద్ చేస్తున్నారు. బస్సులు కూడా కాలనీలో ఆపివేస్తున్నారని యమ్‌యమ్‌టిసిలో ఆఫీసుకు వచ్చాను. ఎంతయినా కార్యాలయంలో పనికన్నా హాజరు ముఖ్యం కదా!
అయినా నిరసనను బందులరూపంలో కాకుండా వేరే రూపంలో ప్రదర్శిస్తే బాగుండునని పిస్తుంది. ఎందుకిలా విలువైన మానవపని గంటలు వృధా చేస్తారు? దాని బదులు రోడ్లపక్కన మొక్కలు నాటో, రోడ్లు శుభ్రంచేసో నిరసన తెలపవచ్చు కదా?
జపాన్‌లో అనుకుంటా ఎక్కడో చదివా కార్మికులకు కోపంవస్తే విపరీతంగా ఉత్పాదకత పెంచేస్తారట... దాంతో వస్తువు విలువ మార్కెట్‌లో అమాంతం పడిపోతుందట... దాంతో యాజమాన్యానికి విపరీతమైన నష్టం... ప్రజలకు లాభం.... ఇదేదో బాగుంది.

Thursday, September 21, 2006

వీటికి ఈ పేరెలా వచ్చింది?

వీటికి ఈ పేరెలా వచ్చిందంటే

  • తిరుపతికి ఆ పేరెలా వచ్చిందంటే తిరుపతిలో డబ్బుల్లేనిదే ఏ పనీ కాదు. తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ప్రతివాడు “తియ్ రూపాయ్ తియ్”, “తియ్ రూపాయ్ తియ్” అంటాడు. అందుకే దానికి తిరుపతి అనే పేరు స్ధిరపడిపోయిందన్నమాట.

  • తిరుమలకు ఆపేరెలావచ్చిందంటే తిరుపతి నుండి తిరుమల వెళ్ళే ప్రతివాడు బస్సులో రుమాల్ (ఖర్చీఫ్) వేసి సీటు రిజర్వ్ చేసుకునేవాడు. కండక్టర్ బస్సు ఎక్కినవెంటనే “తియ్ రుమాల్” , “తియ్ రుమాల్” అని అరిచేవాడు. అలా తిరుమలగా స్ధిరపడిపోయిందన్నమాట.

  • చపాతి కి ఆపేరెట్లావచ్చిందంటే ఒకావిడ ప్రయోగశాల్లో కష్టపడి ప్రయోగం చేసి తయారుచేసిన వంటకాన్ని తన భర్తకు రుచి చూడమని పెడితే ఆయనగారు తిని "ఛ...పో...తియ్" అన్నాట్ట. అది కాస్తా చపాతీగా స్ధిరపడి పోయింది.

  • దోశకు ఆపేరెలావచ్చిందంటే రెండు సార్లు (దో) ఉస్ అంటుంది కనుక.

హామీపత్రం: ఖచ్చితంగా పైవన్నీ నిజం కాదు, నా సొంతమూ కాదు.

Thursday, August 31, 2006

English

ఇదే నిజమైతే తెలుగుకు కూడా ఇదేసూత్రం వర్తించాలిగా?

క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి నుండి సేకరించబడింది
 Posted by Picasa

Wednesday, August 30, 2006

కనబడకుండా

ఈరోజు కనబడకుండా పోతున్న వారి రోజు..

మన యమ్‌ఎల్ఏలు, యంపిలు కూడా వారి వారి నియోజకవర్గ ప్రజానీకానికి కనిపించకుండా
పోతున్నారు...ఏం చేద్దాం?

Monday, August 28, 2006

ఇది భావ్యమా?

నలుగురికీ ఉపయోగపడే ఒక ప్రాజెక్టును ఈవిధంగా
దుర్వినియోగపరచటం భావ్యమా?

ఇది చూడండి:
వికిపీడియాలో ఎవరో ఒక వ్యక్తి  రామవరం గ్రామం వివరాలలో తన సొంత వివరాలు
వ్రాసుకున్నాడు.

http://www.wikimapia.org
లో కూడా చాలా మంది తమ తమ ఇళ్ళకు పేర్లు
పెట్టుకోవటం గమనించారాఅలా చేయవద్దని ఆ సైట్ లో
ముందుగానే పేర్కొనబడింది.   అయినా నోపార్కింగ్ బోర్డు ముందే వాహనాలను
పెట్టినట్టు చేస్తున్నారు.